May 25, 2026 2:17 am

V1News Telangana

ఆర్మూర్ శివార్లలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు చీతా ఫోర్స్ మెరుపు దాడి – ముగ్గురు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఆర్మూర్ శివార్లలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు
చీతా ఫోర్స్ మెరుపు దాడి – ముగ్గురు అదుపులోకి, నగదు, కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం..

నిజామాబాద్, మే 24 (ప్రతినిధి):
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలోని చేపూర్ గ్రామ శివార్లలో నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ మెరుపు దాడి నిర్వహించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేపూర్ గ్రామ శివార్లలో గల సాయన్న ఫామ్ హౌస్‌లో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో చీతా ఫోర్స్ సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ముందస్తు వ్యూహంతో సాయన్న ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టిన పోలీసులు, అక్కడ పేకాటలో పాల్గొంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి రూ.18,300 నగదు, 2 క్రెటా కార్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల హెచ్చరిక
జిల్లాలో ఫామ్ హౌస్‌లు, తోటలు లేదా రహస్య ప్రదేశాల్లో జూదం, పేకాట క్లబ్బులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more