నిజామాబాద్, మే 24:
నగరంలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేశారు. గౌరవనీయులైన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్, ఆదేశాల మేరకు CCS ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది ఆదివారం విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ ప్రాంతంలో, తెలంగాణ పార్క్ సమీపంలోని ఓ ఇంటిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో చీతా ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా మెరుపు దాడి చేపట్టారు.
పోలీసులు ఇంటిని పూర్తిగా తనిఖీ చేయగా అక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో మొత్తం 7 మొబైల్ ఫోన్లు, రూ.4,870 నగదు, 3 మంది విటులు, 5 మంది మహిళలను అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పట్టుబడిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం 4 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
పట్టణ పరిధిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు, వ్యభిచార కేంద్రాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక చర్యలపై నిరంతరం కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
అలాగే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







