బోధన్, మే 24:
బోధన్ మండలంలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే చేర్పించాలని మండల విద్యాధికారి (ఎంఈఓ) నాగయ్య సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, సంబంధిత పాఠశాలకు ప్రభుత్వ అనుమతి, గుర్తింపు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ప్రవేశాలు కల్పించాలని కోరారు.

బోధన్ మండలంలోని సరస్వతి నగర్‌లో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ కు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేదా గుర్తింపు లభించలేదని స్పష్టం చేశారు. అలాగే ఆచార్య విద్యాలయ పాఠశాల కు 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ అనుమతి లేదని తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల వివరాలను మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) బోధన్ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై ప్రదర్శించినట్లు తెలిపారు.
అదేవిధంగా, బోధన్ మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు,

ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రాంగణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు లేదా ఇతర విద్యా సామగ్రి విక్రయాలు నిర్వహించరాదని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో సంబంధిత పాఠశాలలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థుల విద్యా హక్కులు, నాణ్యమైన విద్య, భద్రమైన విద్యా వాతావరణ పరిరక్షణలో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు సహకరించాలని మండల విద్యాధికారి నాగయ్య కోరారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







