సాటాపూర్ పశువుల అంగడి ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్
బోధన్ మే 23 : బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, శాంతి భద్రతలు పరిరక్షించేందుకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శనివారం సాటా పూర్ పశువుల సంత ను ఆకస్మికంగా సందర్శించి పశువుల క్రయ విక్రయాలను గ్రామ పంచాయతీ సిబ్బంది నీ అడిగి తెలుసుకున్నారు.
అదేవిదంగాబ్ నగర పరిధిలో ఏర్పాటు చేసిన వెటర్నరీ డాక్టర్ల చెకింగ్ పాయింట్‌ను కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెటర్నరీ ఆఫీసర్ లు ఇస్తున్న సర్టిఫికేట్ ల గురించి అడిగితెలుసుకున్నారు మరియు పశువుల వాహనాలు తనకి చేసి వాహనాలలో తరలిస్తున్న వాటిని కూడా చెక్ చేసినారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ పశువుల రవాణా, విక్రయాలు మరియు బలి కోసం తీసుకువస్తున్న జంతువులకు సంబంధించిన ఆరోగ్య ప్రమాణాలు సక్రమంగా పాటిస్తున్నారా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్రమ రవాణా , అనారోగ్య పశువుల విక్రయాలు , నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెకింగ్ పాయింట్ల వద్ద పోలీసులు, వెటర్నరీ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీస్ శాఖ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని కమిషనర్ పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ తనిఖీలో ఏసీపి శ్రీ శ్రీనివాస్ , రెంజల్ ఎస్ఐ చంద్ర మోహన్ , జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ రెడ్డి , మండల వెటర్నరీ డాక్టర్ విట్టల్ , డా .ప్రమోద్, డా నరేందర్, డా సురేష్ తదితరులు ఉన్నారు.







