May 25, 2026 2:17 am

V1News Telangana

హిందూ సమాజాన్ని ఒక తాటిపై నిలిపేది ఒక ఆర్ఎస్ఎస్ తోనే సాధ్యం 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

హిందూ సమాజాన్ని ఒక తాటిపై నిలిపేది ఒక ఆర్ఎస్ఎస్ తోనే సాధ్యం 

ఏక చక్ర నగర్ బస్తీలో హిందూ సమ్మేళనం కార్యక్రమం

బోధన్ మే 23: బోధన్ పట్టణంలోని బురుడు గల్లీలో గల అనంత లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద శుక్రవారం హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది సంస్కృత భారతి కార్యకర్త మస్కర్ సురేఖ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో సనాతన ధర్మాన్ని పాటిస్తూ కుటుంబ జీవనంలో బంధావ్యాలు బంధుత్వాల గురించి పిల్లలకు నేర్పాలన్నారు అలాగే ప్లాస్టిక్ రహిత సమాజం, పర్యావరణ పరిరక్షణ, మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాలపై ఆమె వివరించడం జరిగింది. అలాగే ఆర్ఎస్ఎస్ విభాగ బౌద్ధ కృష్ణశాస్త్రి గారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సోమలింగ శివాచార్యం మహారాజ్ స్వామీజీ మాట్లాడుతూ ఇంటి లోపలనే కులం ఇల్లు దాటితే మనమంతా హిందూ సంప్రదాయాలను పాటిస్తూ పిల్లలకు తెలియజేయాలని, హిందువులంతా ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు. పెద్దగుట్టకు పోయి ఇబ్బందులు పడొద్దు అని మన ఆలయాలు ఎన్నో ఉన్నాయని మర్చిపోవద్దని అన్నారు. ప్రతి ఒక్క హిందువు తప్పకుండా నువ్వు తిట్టిన తిలకం ధరించాలని మహిళలు కచ్చితంగా గాజులు వేసుకోవాలని అన్నారు. లవ్ జిహాద్ బారిన పడకుండా మన మహిళలను మనమే రక్షించుకోవాలని పిల్లలపై తల్లిదండ్రులు ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచాలని అన్నారు. అప్పటిలో భారతదేశంలో పాకిస్తాన్ కి జరిగిన యుద్ధాన్ని తెలియజేస్తూ బాబర్ చేసిన అరాచకాల గురించి వివరించారు. హిందువులు ఏకతాటిపైకి వచ్చి కలిసి మెలిసి ఉంటేనే భవిష్యత్ తరాల మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. లవ్ జోహార్ పేరుతో హిందూ మహిళను టార్గెట్ చేశారని గుర్తు చేశారు. శిధిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించుకోవాలని ప్రతి రోజు ఆలయాలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Naveen Naveen
Author: Naveen Naveen

Leave a Comment

Read more