బోధన్ 13వ వార్డులో అభివృద్ధి పనులు
బోధన్ మే 23: బోధన్ పట్టణంలోని 13వ వార్డులో శుక్రవారం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 13 వ వార్డు కౌన్సిలర్‌గా లంకా రవి ప్రజల సమస్యలను గుర్తించి డ్రైనేజీ తవ్వకాలు, కాలువల మరమ్మతులు వంటి పలు ప్రజా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను కొనసాగిస్తూ వార్డును శుభ్రంగా, సుందరంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. కౌన్సిలర్ లంక రవి మాట్లాడుతూ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి, కమిషనర్, మున్సిపల్ చైర్మన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లంక రవి, జవాన్ జబ్రియల్, మున్సిపల్ సిబ్బంది వాసులు ఉన్నారు.







